Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చల్లపల్లి పోలీసు స్టేషన్ లో భారీ పేలుడు
posted on: Mar 31, 2026 12:20PM

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ మంగళవారం (మార్చి 31) ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ ఎస్సైతో పాటు మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. అక్రమంగా నిలవ ఉంచిన మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి పరిశీలిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.
పేలుడు తీవ్రతకు స్టేషన్ భవనం పాక్షికంగా దెబ్బతింది. స్టేషన్ ఆవరణలో నిలిపి ఉంచిన కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడులో గాయపడిన పోలీసులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చల్లపల్లి సీఐ కేఎస్ రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. కాగా పేలుడు శబ్దానికి ఆ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.


.webp)



