మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించి స్వయంగా నడిపిన బాలయ్య

posted on: Feb 5, 2026 8:15AM

హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హిస్పటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్నిప్రారంభించి స్వయంగా నడిపారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా బుధవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ బ్రాకీ థెరపీ యూనిట్, ఆపరేషన్ థియోటర్లు, మోల్డ్ గదులను ప్రారంభించారు. అనంతరం క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించి   నడిపారు.  ఈ సందర్భంగా ఆయన దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని 2007లో ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.  

తమ ఆస్పత్రి తరఫున ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామని.. ఈ ఏడాది  ఇప్పటికే 56 వేలకుపైగా పరీక్షలు చేశామనీ చెప్పారు.   మామోగ్రఫీతో పాటు అన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను మొబైల్ వాహనంలో నిర్వహిస్తున్నామన్న ఆయన  స్క్రీనింగ్ తర్వాత అవసరమైన వారికి ఆస్పత్రికి తీసుకొని వచ్చి చికిత్స అందిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...