షేక్ పేట్ డివిజన్ లో బీజేపీ స్కోరు జీరో ఓట్లు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైన క్షణం నుంచీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలోనే ఉన్నారు. రౌండు రౌండుకూ ఆయన మెజారిటీ పెరుగుతూ వచ్చింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గట్టిపోటీయే ఇచ్చినా వెనుక బడ్డారు.

కానీ ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారం మాదే.. అందుకు జూబ్లీ విజయంతో తొలి అడుగు వేస్తాం అంటూ  గొప్పలు చెప్పుకున్న బీజేపీ జూబ్లీ బైపోల్ లో అసలు పోటీయే ఇవ్వకపోవడం. జాతీయ పార్టీ, అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. జూబ్లీ ఉప ఎన్నికలలో ఘోరంగా పెర్ఫార్మ్ చేసింది.

కౌంటింగ్ పూర్తి కాకముందే ఓటమి అంగీకరించేసి ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి ఇంటికి వేంచేశారు. సరే రాజకీయపార్టీకి గెలుపు ఓటములు సహజమే అని సరిపెట్టుకోవడానికి కూడా లేనంత ఘోర పరాభవం బీజేపీకి జూబ్లీ ఉప ఎన్నికలో ఎదురైంది. అదెలా అంటారా? కమలం పార్టీలో షేక్ పేట డివిజన్ లో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా రాలేదు. ఔను నిజం.. ఓట్ల లెక్కింపులో భాగంగా   షేక్ పేట డివిజన్ లో ఓట్ల లెక్కింపులో బీజేపీ జీరో ఓట్లు స్కోర్ చేసింది. దీంతో కమలం నేతలు షాక్ కు గురయ్యారు. కనీసం ఆ పార్టీ తమ ఏజెంట్లుగా పెట్టుకున్న వారు కూడా బీజేపీకి ఓటు వేయలేదన్న సంగతి తేటతెల్లమైంది.  బీజేపీ పరిస్థితి భాగ్యనగరంలో ఇంత ఘోరంగా ఉందా అని ఆ పార్టీ వ్యతిరేకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu