Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో పొత్తులపై కమలం పార్టీ క్లారిటీ!
posted on: Mar 10, 2026 8:19AM

బీజేపీ ఎట్టకేలకు మౌనం వీడింది. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదన్నారు. ఇది బీజేపీ తుదినిర్ణయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు భారీగా బీజేపీలోకి వస్తున్నారని, వారిని ఆపుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ పొత్తుల డ్రామాకు తెరతీశారన్నారు. తమ క్యాడర్ ను, లీడర్ లను కాపాడుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీతో పొత్తు అంటూ లీకులు ఇస్తున్నారని విమర్శించారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ బలమన్న రామచందర్ రావు.. రేవంత్ సర్కార్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరాతి ఘోరంగా విఫలమైందన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, కుటుంబ పాలన వంటి అంశాల కారణంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన అటువంటి బీఆర్ఎస్ తో చేతులు కలిపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు క్లారిటీతో.. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖపోరు అనివార్యం అని తేలిపోయింది.
అలాగే బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి పొత్తు అంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండించినట్లైంది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ సర్కార్ పై కూడా విమర్శలు గుప్పించడంతో బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం అన్న బీఆర్ఎస్ విమర్శలను కూడా బీజేపీ ఖండించింది. ఇంత కాలంగా బీజేపీ చీకటి ఒప్పందాలు, పొత్తులు అన్న విమర్శలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి గట్టిగా వినిపిస్తున్నా.. ఇంత వరకూ కమలం పార్టీ వాటిపై స్పందించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటి? రాష్ట్రంలో సొంతంగా అధికారం చేపట్టే అవకాశం లేకుంటే.. ఏదో ఒక పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పొత్తుల ప్రశక్తే లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు.


.webp)
.webp)


