తెలంగాణలో బీజేపీకి ఒంటరి ఎజెండా కలిసి వస్తుందా?

posted on: Jun 10, 2026 3:50PM

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా  ప్రకటన పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.  రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు. 

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బరిలోకి దిగిన బీజేపీ 5 స్థానాలు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ 12 చోట్ల విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాషాయపార్టీ ఒక్క సీటుకే పరిమితమైంది. 2023 ఎన్నికల్లో ప్రత్యామ్నాయం తామే అని ఊదరగొట్టిన కాషాయ నేతలు 8 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్క సారి కూడా డబుల్ డిజిట్ సీట్లు గెలవని ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంపై కలలు కంటూనే ఉంది. ఇక ఇప్పుడు ఒకవైపు జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్‌కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో అమిత్‌షా సోలో ప్రకటన చర్చనీయాంశం అయ్యింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...