మహిషాసురుడి ఉత్సవంలో... బీజేపీ ఎంపీ!

posted on: Feb 26, 2016 3:49PM

 

జేఎన్‌యూ క్యాంపస్‌లో దసరాకి బదులుగా మహిషాసురుడికి ఉత్సవాలని నిర్వహించడం గురించి పార్లమెంటులో స్మృతీ ఇరానీ విమర్శించిన విషయం తెలిసిందే! ఇందుకు సాక్ష్యంగా ఆమె ఆ ఉత్సవానికి సంబంధించిన కరపత్రాలను కూడా చదివి వినిపించారు. బీజేపీ పార్టీ యావత్తూ ఈ విషయంలో స్మృతీకి మద్దతు పలికారు. అయితే అలాంటి ఒక సందర్భంలో ఇప్పటి బీజేపీ ఎంపీ ఒకరు ఆ ఉత్సవంలో స్వయంగా పాలుపంచుకున్నారన్న విషయం వివాదాస్పదంగా మారుతోంది.

 

దిల్లీకి చెందిన ఉదిత్‌ రాజ్ అనే పార్లెమంటు సభ్యుడు 2013లో జరిగిన మహిషాసురుని మహోత్సవానికి అతిథిగా నిలిచారట. అయితే ఉదిత్‌ రాజ్‌ ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. తాను ఏటా వందలాది ఉత్సవాలలో పాల్గొంటూ ఉంటాననీ, 2013లో తాను బీజేపీలోనే లేననీ చెప్పుకొచ్చారు. పైగా మనుషులన్నాక వేర్వేరు సమయాలలో వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉంటారనీ, తాను ఇప్పుడు మారిపోయాననీ చెప్పుకొచ్చారు. ఉదిత్‌ ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నా, కాంగ్రెస్‌కు ఇప్పుడు ఓ బలమైన ఆయుధం దొరికినట్లే కనిపిస్తోంది.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...