Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ గుర్రం కాలు ఇక పనిచేయదు
posted on: Mar 18, 2016 11:48AM
.jpg)
ఒకప్పడు శక్తిమాన్ అన్న పేరు వింటే అదేదో టీవీ సీరియల్ అనుకునేవారు. కానీ ఇప్పడు అదో గుర్రం పేరు అని కూడా జనాలకి స్ఫురిస్తోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ పోలీసు గుర్రం మీద ఓ బీజేపీ ఎమ్మెల్యే తన జులుం చూపించిన విషయం తెలిసిందే! గొడ్డుని బాదినట్లు అన్న సామెతకు మించి సదరు ఎమ్మెల్యే ఈ మూగజీవిని బాదడంతో, శక్తిమాన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. శక్తిమాన్ కాలుకి తీవ్ర గాయాలు అయ్యాయని గ్రహించిన పశువైద్యలు ఎంతగా ప్రయత్నించినా, గాయాలను మాన్పలేకపోయారు. దాంతో వేగంగా కుళ్లిపోతున్న గుర్రం కాలుని తీసివేయక తప్పని స్థితి వచ్చింది. ఆ స్థానంలో త్వరలోనే ఓ కృత్రిమ కాలుని అమరుస్తామని వైద్యులు పేర్కొన్నారు. శక్తిమాన్ మీద ప్రజాప్రతినిధి జులుంకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వస్తృతంగా ప్రచారం కావడంతో, సదరు ఎమ్మెల్యేని అరెస్టు చేయాలంటూ పోలీసుల మీద ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో గణేష్ జోషి అనే ఆ ఎమ్మెల్యేని నిన్న పోలీసులు అరెస్టు చేయక తప్పలేదు. అయితే కేవలం అరెస్టుతోనే ఈ వ్యవహారం ఆగేట్లు కనిపించడం లేదు. గణేష్ జోషిని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ, సాక్షాత్తూ కేంద్ర మంత్రి మేనకా గాంధి డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటే చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవచ్చుననుకునే వారికి, ఇప్పటి సంఘటన ఓ గుణపాఠంగా మిగిలిపోవచ్చు.






