బీజేపీ డిపాజిట్ గల్లంతు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో  బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో మాదే అధికారం అని చెప్పుకుంటున్న బీజేపీకి జూబ్లీ బైపోల్ లో డిపాజిట్ గల్లంతు కావడం పెద్ద షాక్ అనే చెప్పాలి. అంతే కాదు.. షేక్ పేట్ డివిజన్ లో కమలం పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క ఓటు కూడా రాలేదు.

 బీజేపీ జూబ్లీ బైపోల్ లో ఓటమిని ప్రచార పర్వంలోనే అంగీకరించేసింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీ ఎన్నిక చాలా చిన్న ఎన్నిక అంటూ చేసిన కామెంట్ తో ఆ పార్టీ శ్రేణులు సైతం ఓటమి ఖాయమన్న భావనకు వచ్చేశారు. అయితే కనీసం డిపాజిట్ కూడా రానంతగా బీజేపీ చ తికిల పడుతుందని పరిశీలకులు కూడా ఊహించలేదు.

బీజేపీకి పట్టణ ప్రాంతాలలో ఒకింత పట్టు ఉందని అంతా భావిస్తారు. ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలో ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పట్టణ ప్రాంతాలలో కూడా బీజేపీ పట్టు అంతంత మాత్రమేనని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కేవలం 9100 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలో తనకు డిపాజిట్ రాకపోవడంపై స్పందించిన అభ్యర్థి దీపక్ రెడ్డి.. జూబ్లీ ఉప ఎన్నికలో డబ్బు ప్రభావం అధికంగా ఉందన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu