Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రకాష్ రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి..బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్..!
posted on: Jul 5, 2026 2:51PM

సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి, హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అలాంటి వ్యాఖ్యల ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రకాష్ రాజ్‌కు సంబంధించిన ఒక ఆడియో బయటపడటం ఈ వ్యవహారానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా దేశ ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలను ప్రభుత్వం, పోలీసులు ఏమాత్రం ఉపేక్షించరాదని, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొందరు కూడా సహకరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో సమగ్ర విచారణ జరిపించి, కుట్రలో పాల్గొన్న వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు.



.webp)


