బీజేపీ ఎన్నికల చోరీ.. రాహుల్ ధ్వజం

posted on: May 5, 2026 9:13AM

అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో   అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ,  పద్ధతి ప్రకారం ఓట్ల చోరీని అమలు చేసిందనీ ధ్వజమెత్తారు.   కేంద్రంలోని అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించి ఓటర్ల తీర్పును తారుమారుచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 

ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో  బీజేపీ  ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం (మే 4)   తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో చేసిన ఓ పోస్టులో.. పశ్చిమ బెంగాల్‌లో వందకు పైగా సీట్లలో ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు.  ఇది బీజేపీకి తెలిసిన పాత వ్యూహమేనని, గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా పద్ధతిని చూశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  బీజేపీ ఎన్నికలనే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించే వ్యవస్థల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందని ఆయన ధ్వజమెత్తారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...