Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర : వీ.హెచ్
posted on: Aug 21, 2026 6:44PM
.webp)
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న ‘వికసిత్ భారత్’లో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం కాకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని వి.హెచ్. ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలోని మెజారిటీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యానికి అనుగుణంగా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని వి.హనుమంతరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో ఓబీసీ జనాభా వివరాలను నమోదు చేయకుండా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం కోసం జనాభా లెక్కలు కీలకమని, ఓబీసీలకు వారి జనాభా ప్రాతిపదికన హక్కులు, అవకాశాలు దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 25న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు వి.హనుమంతరావు వెల్లడించారు. ఈ మహాసభ ద్వారా బీసీల హక్కులు, జనాభా దామాషా ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.
BJP conspiracy behind CM cancellation of US visit, V. Hanumantha Rao, CWC, Mahabubnagar District, PM MODI, CM Revanth reddy






