చంద్రబాబు మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.. నెట్టింట వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

posted on: Apr 20, 2026 12:17PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం  అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అయనకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  అయితే, అన్నింటికంటే ముఖ్యంగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్  సోషల్ మీడియా  వేదికగా చంద్రబాబుకు   బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.   తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబును ఎంతో ఆత్మీయంగా  మావయ్యాఅని సంబోధిస్తూ తారక్ చేసిన ట్వీట్  తెలుగుదేశం శ్రేణుల్లోనూ, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.  

గతంలో కూడా  జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు   జన్మదినాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే మావయ్యా అని సంబోధిస్తూ చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలపడం ఇదే మొదటి సారి. గతంలో ఆయన చేసిన ట్వీట్లలో  గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  గారికి  అని పేర్కొనే వారు. ఈ సారి అందుకు భిన్నంగా మావయ్యా అని సంబోధించడం ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.  

ప్రజలకు సేవ చేయడంలో చంద్రబాబు చూపే దార్శనికత, పట్టుదల ఇలాగే కొనసాగాలని  ఆకాంక్షిస్తూ.. చంద్రబాబు నాయకత్వంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. గత కొంతకాలంగా నందమూరి, నారా కుటుంబాల మధ్య సంబంధాలపై సామాజిక మాధ్యమంలో చర్చోపచర్చలు జరుగుతున్ననేపథ్యంలో..మావయ్యా అంటూ జూనియర్ఎన్టీఆర్ చేసిన ట్వీట్.. ఆ చర్చలకు, అపోహలకు, ప్రచారానికి చెక్ పెట్టింది.  వారి మధ్య ఉన్న కుటుంబ అనుబంధం చెక్కుచెదరలేదని చాటింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...