అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ.. యంత్రాంగం అప్రమత్తం

posted on: Feb 9, 2026 11:58AM

అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. స్వల్ప వ్యవధిలో జిల్లాలోని సదుం మండలంలో వేలాది కోళ్లు అకస్మికంగా మరణించడం ఆందోళన రేకెత్తిస్తోంది. మండల పరిధిలోని మూడు గ్రామాలు పుట్టవాండ్ల పల్లె, కంభంవారి పల్లె, అమ్మగారిపల్లెలలో గత కొద్ది రోజులుగా వేలాది కోళ్లు మరణించాయి. కోళ్ల ఫారంలలోని కోళ్లు పెద్ద సంఖ్యలో మరణిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మరణించిన కోళ్ల నమూనాలను భోపాల్ లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కు పరీక్షల నిమిత్తం పంపించారు. టెస్టుల్లో కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగానే మరణించాయని తేలడంతో అధికార యంత్రాంగం అలర్టయ్యింది. జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి బర్డ్ ఫ్లూ వ్యాప్తి అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడి భారీగా నష్టపోయిన కోళ్ల పారాల యాజమాన్యాలకు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...