అమరావతికి బిల్ గేట్స్.. ఎందుకంటే?

posted on: Feb 4, 2026 9:20AM

 

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో భేటీ అవుతారు.  ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, పాలన రంగాల్లో డిజిటల్ విప్లవం తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఒప్పందం మేరకు రాష్ట్రంలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, పాలన రంగాల్లో డిజిటలైజేషన్ పై ఈ భేటీలో చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య చర్చ జరుగుతుందనీ, అలాగే ఒప్పందం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారనీ సమాచారం. ఇందు కోసం ఈ నెల 18న బిల్ గేట్స్ అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా  అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపా దనలపై  స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...