ప్రతికూల వాతావరణం.. గన్నవరం విమానాశ్రయంపై బిల్ గేట్స్ విమానం చక్కర్లు!
posted on: Feb 16, 2026 9:25AM
.webp)
దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతికూల వాతావ రణం నెలకొంది. ఈ కరణంగా కొద్ది సేపు విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. దట్టమైన పొగ మంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ ప్రత్యేక విమానం ల్యాండింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి.
విజిబులిటీ లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావలసిన బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం కొద్ది సేపు విమానాశ్రయంపైనే చక్కర్లు కొట్టింది. దాదాపు 15 నిముషాల పాటు ల్యాండింగ్ కాకుండా ఆఇకాశంలోనే చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు పరిస్థితి మెరుగుపడటంతో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ పర్యటనలో బిల్ గేట్స్ పీసంజీవని వైద్య సేవలు సహా పలు కీలక ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ తో చర్చలు జరిపేందుకు రాష్ట్రపర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.


.webp)



