అమరావతిలో బిల్ గేట్స్
posted on: Feb 16, 2026 9:14AM
.webp)
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతి పర్యటనకు వచ్చారు. సోమవారం (ఫిబ్రవరి 16) ఉదయంగన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్ కు ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, మంత్రులు వంగలపూడి అనిత. అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. తో పాటు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో బిల్ గేట్స్ తో పాటు ఆయన ఫౌండేషన్ కు చెందిన ఆరుగురు ప్రతినిథుల బృందం కూడా ఉంది. సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ బృందానికి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్ బృందంతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. అంతకు ముందు బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ఆర్టీజీఏస్ను బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ ద్వారా అమలవుతున్న విధానాలు, అందుతోన్న ఫలితాలనుఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బిల్ గేట్స్‌కు వివరించారు.




.webp)


