మోదీ నిర్ణయాన్ని బిల్ గేట్స్ మెచ్చుకోవటం నిజం కాదా?

posted on: Nov 18, 2016 3:19PM

 

మోదీ నోట్ల రద్దు నిర్ణయం పెద్ద సర్కస్ లా మారిపోయింది! దాని గురించి ఎవరికి వారు తమకు తోచినట్టు చెప్పేస్తున్నారు. ఆఖరుకు ఎంతో పేరున్న న్యూస్ పేపర్స్ , ఛానల్స్ కూడా తమ వంతుగా కన్ ఫ్యూషన్ కు కారణం అవుతున్నాయి. అందుకు ఉదాహరణ, డీమానిటైజేషన్ గురించి బిల్ గేట్స్ ఏమన్నాడు అన్న వార్తే!


బిల్ గేట్స్ మోదీ నిర్ణయాన్ని... ఆయన సమక్షంలోనే మెచ్చుకున్నాడని ముందుగా వార్తలొచ్చాయి. దీని వల్ల త్వరలోనే ఇండియా డిజిటలైజ్ అవుతుందని , పారదర్శకత పెరుగుతుందని ఆయన చెప్పారన్నారు. కాని, కొన్ని గంటలు గడిచేలోపే బిల్ గేట్స్ నోట్ల రద్దుపై తనకు ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పాడని మళ్లీ వార్తలొచ్చాయి. అయితే, మోదీ నోట్లు రద్దు చేయటం పై ఎలాంటి ఒపీనియన్ లేకున్నా భారత్ మాత్రం త్వరలో డిజిటలైజ్ అవుతుందని ఆయన రీపీట్ చేశాడట! అసలింతకీ బిల్ గేట్స్ మోదీ డిసీషన్ కి మద్దతిచ్చాడా లేదా? ఏమో... మీడియాకే తెలియాలి. బిల్ గేట్స్ కే తెలియాలి. వంద నోట్ల కోసం వంద పాట్లు పాడుతోన్న జనానికి బిల్ గేట్స్ ఏమన్నా ఇప్పుడు వినిపించే అవకాశమే లేదు!    

google-ad-img
    Related Sigment News
    • Loading...