పెద్దవాగులో భార్యాభర్తలు గల్లంతు... ఒకరు మృతి

posted on: Oct 31, 2025 5:58AM

మొంథా తుపాను కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో   గత  నాలుగు రోజులుగా కురు స్తున్న  భారీ వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే రంగా రెడ్డి జిల్లా  అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం  వద్ద ఉన్న పెద్ద వాగు వరద నీటితో పొంగి ప్రవహిస్తోంది.  

ఆ క్రమంలో బైక్ పై వెడుతున్న దంపతులు  పెద్ద వాగు దాటుతుండగా... వరద ప్రవాహంలో  బైక్ అదుపు తప్పి వాగులో పడిపోయింది. దీంతో భార్యాభర్తలు వాగులో పడిపోయారు. అక్కడ ఉన్న స్థానికులు, పోలీసు సిబ్బంది గమనించి వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భర్తను కాపాడగలిగారు. భార్య కృష్ణ వేణి వరదనీటిలో మునిగి మృతి చెందారు.  ఈ దంపతులు  ఇబ్రహీం పట్నం నేర్రపల్లి గ్రామంలోని బంధువుల ఇంటి నుంచి   భువనగిరి వెళ్తుం డగా ఈ ప్రమాదం జరిగింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...