బిహార్‌లో జంగిల్ రాజ్ ఎప్పటికీ తిరిగిరాదు : ప్రధాని మోదీ
posted on Nov 14, 2025 7:19PM
.webp)
బిహార్‌లో ప్రజలు వికసిత్ భారత్ కోసం ఓటేశారని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మాట్లాడుతూ.. బిహార్ ప్రజలు అతి పెద్ద విజయం అందించారన్నారని.“బిహార్‌లో ఇవాళ ప్రతి ఇంట మఖానా పాయసం వండుకునే ఆనందం కనిపిస్తోంది. ఒకప్పుడు ‘జంగిల్ రాజ్’ అన్న మాట వచ్చినప్పుడు ఎలాంటి వ్యతిరేకత లేదని… ఇక ఆ రోజులు తిరిగి రానివ్వమని ప్రజలు తేల్చిచెప్పారు” అని మోదీ తెలిపారు. తాము ప్రజలకు సేవకులమని, వారి మనసులు గెలుచుకోవడమే లక్ష్యమని ఆయన అన్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్ చేసి ఎన్డీఏకి ప్రజలు ఘనవిజయం అందించారని అభినందించారు.
జంగిల్ రాజ్ కాలంలో జరిగిన దోపిడీలు, అక్రమాలు, హింసను ప్రజలు మరచిపోలేరని… ఈసారి వచ్చిన ఫలితాలతో ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని ప్రధాని తెలిపారు. ఒకప్పుడు బిహార్‌లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎన్నికలు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసేవని… ఇప్పుడు ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా బయటకు వచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్ చేసిన పరిస్థితి బిహార్ మార్పుకు నిదర్శనమని మోదీ పేర్కొన్నరు. నూతన సంకల్పంతో బీహార్ అభివృద్ధికి పని చేసేందుకు ఈ చరిత్రక విజయం మరింత శక్తినిస్తుందన్నారు. యువశక్తి, మహిళా శక్తి ఉజ్వల భవిష్యత్తు కోసం తగిన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విజయం వెనుక సీఎం నితీశ్ కుమార్ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. ఎన్డీయే కూటమి సభ్యులకు ప్రధాని అభినందనలు తెలిపారు.