ఆయనొస్తున్నాడా? అయితే ఏంటంట?

posted on: Mar 24, 2014 7:08PM

 

 

 

నిన్న మొన్నటి వరకు తెలుగు ఛానళ్ళలో ‘ఆయనొస్తున్నాడు’ అనే ప్రకటనలు హడావిడి సృష్టించాయి. ఈ ప్రకటనల సారాంశం ఏంటంటే, సామాన్య ప్రజలకు ఏదో సమస్య వస్తుంది. రాజకీయ నాయకులు ఆ సమస్యని పట్టించుకోరు. ప్రజలు ఎదురు తిరుగుతారు. రాజకీయ నాయకులు నిర్లక్ష్యంగా మాట్లాడతారు. చివరికి ప్రజల్లో ఓ కేరెక్టర్ రాజకీయ నాయకులని నీచంగా చూస్తూ, చూపుడు వేలు గాల్లోకి తిప్పుతూ ‘ఆయనొస్తున్నాడు’ అంటుంది. ఎవరాయన? రాజకీయ నాయకుడు ప్రశ్నిస్తే ఆయన ఎవరో కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి పుత్రరత్నం జగన్ అనే విషయం రివీల్ అవుతుంది. వెంటనే ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ బొంగురు గొంతు ‘ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి.. దుమ్ము దులిపేయండి’ అని సందేశం ఇస్తుంది.

 

గత కొంతకాలంగా ఈ ప్రకటన చూసి రాష్ట్రంలో ప్రజలందరూ హాయిగా నవ్వుకుంటున్నారు. ప్రకటనలో కేరెక్టర్ ఆయనొస్తున్నాడు అంటూ గాల్లోకి వేలు తిప్పడం చాలామందికి అర్థం కావడం లేదు. అలా వేలు తిప్పడం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానికి కారణమైన హెలికాప్టర్ని సూచిస్తోందా? ఇక మిగిలేది సున్నానే అనే అర్థమా అనేది అర్థం కాక జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ తర్వాతగాని అలా వేలు తిప్పడం ఫ్యాన్ గుర్తుకు సింబాలిక్ అని అర్థం చేసుకున్నారు. గత కొంతకాలంగా తెలుగు ప్రజలకు నవ్వుల్ని పంచుతున్న ఈ ప్రకటనలు సడెన్‌గా ఛానెళ్ళలోంచి మాయమైపోవడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు. 



తమ నవ్వులకు ఆటంకం కలిగించిన కారణాలేంటా అని పరిశోధిస్తే ఆస్తకికరమైన విషయాలు  తెలిశాయి. వైఎస్సార్సీపీ ఈ ప్రకటనలని అనేక  ఛానెళ్ళలో ప్రసారం చేసింది. తమ అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయకూడదని ఎన్నికల కమిషన్ అభ్యంతర పెట్టింది. దాంతో వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్‌కి ఈ ప్రకటనల ప్రసారం చేయడానికి అనుమతి కోరుతూ లేఖ రాసింది. అయితే ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనల ప్రసారానికి అంగీకరింబోనని స్పష్టం చేసింది. ఆయనొస్తున్నాడా? అయితే ఏంటంట? అని చెప్పకనే చెప్పేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...