ఏపీ లిక్కర్ స్కామ్.. నిందితులు ఆస్తుల అటాచ్ కు కోర్టు అనుమతి
posted on Nov 1, 2025 6:43AM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితల ఆస్తుల అటాచ్ మెంట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే జీవోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముడుపుల సొమ్ముతో నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయాలంటూ ప్రభుత్వం జీవో నంబర్ 111, జీవో నంబర్ 126 జారీ చేసింది. ఆ జీవోల మేరకు నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 111, 126లలోని ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి కోరుతూ సీటి్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు అందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మద్యం కుంభకోణంలో నిందితుల ఆస్తులను సిట్ జప్తు చేయనుంది.
కాగా మద్యం కుంభకోణంలో కోట్లది రూపాయల అక్రమ సంపాదనతో ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి పలు చోట్ల ఆస్తులను కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా మామెరపల్లె, మాచ్ పల్లి గ్రామాల పరిధిలో 27.06 ఎకరాలు, అలాగే తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరిట 3.14 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సిట్ ఆధారాలతో సహా కనుగోంది. ఇప్పుడు సిట్ ఆ ఆస్తులను అటాచ్ చేయనుంది.
కాగా వైసీపీ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు 16 మందిని అరెస్టు చేశారు. మొత్తం 48 మందిపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి సహా పలువురు నిందితులు పస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.