లోకేష్ కు భువనేశ్వరి జన్మదిన శుభాకాంక్షలు
posted on: Jan 23, 2026 1:28PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లి నారా భువనేశ్వరి తన కుమారుడికి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో తనయుడికి జన్మదిశ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవనేశ్వరి పోస్ట్ చేసిన సందేశం భావోద్వేగ పూరితంగా ఉండి నెటిజనులను విశేషంగా ఆకట్టుకుంది.
కొడుకు ఎంత ఎదిగినా తల్లికి మాత్రం బిడ్డగానే కనిపిస్తాడంటారు, లోకేశ్‌ను చూస్తున్నప్పుడు కూడా నిన్న మొన్నటి వరకు నా చేతుల్లో ఆడుకున్న పిల్లాడేనా అనిపిస్తుందని పేర్కొన్న భువనేశ్వరి ఆ పిల్లాడే ఇప్పుడు మంత్రిగా బాగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాన్నా లోకేశ్... ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను నువ్వు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నానంటూ భువనేశ్వరి తన సందేశంలో పేర్కొన్నారు.
.webp)



.webp)


