Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భూపాలపల్లి DTO వెంకన్న మృతిపై విచారణ వేగవంతం
posted on: Jun 24, 2026 9:13PM

ఈ నెల 22 వ తేదీ ఉదయం భూపాలపల్లి RTO ఆఫీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించిన జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ ను విచారణ అధికారిగా నియమించింది. ఈ విచారణ లో భాగం గా విచారణ అధికారి చంద్ర శేఖర్ గౌడ్ భూపాలపల్లికి విచ్చేసి సమగ్ర విచారణ చేపట్టారు. ఈ విచారణ లో భాగం గా మొదట ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు.
సంఘటన కు సబంధించి పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను స్టేషన్ సీఐ కరుణాకర్ రావు, ఎస్ ఐ అశోక్ లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత లారీ డ్రైవర్ ను, లారీ ఓనర్ మరియు హార్వెస్టర్ డ్రైవర్ ను విచారించారు. తర్వాత జెన్ కో అధికారులతో సమావేశమయ్యి ఆ రోజు లారీ లో ఉన్న బొగ్గు వివరాలు తెలుసుకున్నారు. తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురు ప్రత్యక్ష సాక్షులను విచారించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి సంఘటన జరిగిన పరిస్థితులను విశ్లేషించారు.
సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. తర్వాత బొగ్గు లోడింగ్ పాయింట్ అయిన తాడిచర్ల కు వెళ్లి అక్కడ ఓపెన్ కాస్ట్ ప్రతినిధులతో సమావేశమయ్యి ఆరోజు ఆ లారీ లోడ్ రికార్డులను పరిశీలించారు. విచారణ అధికారి చంద్ర శేఖర్ గౌడ్ వెంట మోటారు వాహన తనిఖీ అధికారులు జంగ్లీ శ్రీనివాస్, శివపల్లి శ్రీనివాస్, బారగాడి శ్రీనివాస్, ఘన్ పూర్ సి ఐ కరుణాకర్ రావ్ ఎస్ ఐ అశోక్ , భూపాలపల్లి ఏ ఎం వి ఐ లు ఫాహిమా సుల్తానా, సుందర్ లాల్, శ్రీనివాస్ ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో సంఘటన కు సంబంధించిన ప్రాథమిక నివేదిక వివరాలను రవాణా కమిషనర్ కు అందజేయనున్నారు


.webp)



