‘భీమ్‌’ యాప్ రికార్డ్.. పదిరోజుల్లో కోటి డౌన్‌లోడ్స్‌...

posted on: Jan 9, 2017 5:43PM


ప్రధాని నరేంద్ర మోడీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను ‘భీమ్‌’ యాప్ ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ యాప్ ఆవిష్కరించిన పదిరోజుల్లోనే 10మిలియన్ల పైన డౌన్‌లోడ్లు అంటే కోటి మంది డౌన్ లోడ్ చేసుకొని రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... అవినీతిని రూపుమాపేందుకు ప్రజలు నగదు రహిత లావాదేవీలపై ఏవిధంగా మొగ్గుచూపుతున్నారనే దానికి భీమ్‌ యాప్‌ నిదర్శనమని... మేక్‌ ఇన్‌ ఇండియాకు ఇదొక చక్కని ఉదాహరణ, ప్రజలు సాంకేతికతను ఎలా అందిపుచ్చుకుంటున్నారనేది దీని వల్ల అర్థమవుతుందని అన్నారు. కాగా ప్రస్తుతం ఈ యాప్‌ ఆంగ్లం, హిందీ భాషల్లో లభ్యమవుతోంది. ఆధార్‌, బ్యాంకు ఖాతాల అనుసంధానంతో ఎవరైనా ఈ భీమ్‌ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.

 

ఇదిలా ఉండగా అల‌హాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌, యాక్సిస్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌, కెన‌రా బ్యాంక్, కాథ‌లిక్ సిరియ‌న్ బ్యాంక్‌, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ, దేనా బ్యాంక్‌, ఫెడ‌ర‌ల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐడీఎఫ్‌సీ, ఇండియన బ్యాంక్, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్, ఇండ‌స్ఇండ్‌, కర్ణాట‌క బ్యాంక్‌, క‌రూర్ వైశ్య‌, కోట‌క్ మ‌హీంద్రా, ఓబీసీ, పంజాబ్ నేష‌నల్ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, సౌత్ ఇండియ‌న్‌, స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్‌, ఎస్‌బీఐ, సిండికేట్‌, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజ‌యా బ్యాంకులు భీమ్ యాప్‌ను స‌పోర్ట్ చేస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...