Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారతి బిల్డర్స్ స్కామ్...రూ.17.97 కోట్ల ఆస్తులు అటాచ్
posted on: Mar 23, 2026 5:37PM

రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసే భారీ మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హోమ్‌బయ్యర్లు, పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్ జోనల్ కార్యాలయం సుమారు రూ. 17.97 కోట్ల విలువైన చరాస్తి, స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ 2024 మే 4న నమోదు చేసిన FIR నెం. 10/2024 ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ముల్పురి శివరామకృష్ణ, దుపాటి నాగరాజు, దొడ్డకుల నర్సింహారావు @ పొన్నారి తదితరులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు.
వీరిపై IPC 406, 420 సెక్షన్లతో పాటు తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. అధికారుల దర్యాప్తులో పలు విషయాలు బయటపడ్డాయి. ముల్పురి శివరా మకృష్ణ, దుపాటి నాగరాజు తో కలిసి “భారతి లేక్ వ్యూ టవర్స్” పేరిట ప్రీ-లాంచ్ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా 450 మందికి పైగా హోమ్‌బయ్యర్లను ఆకర్షించి, ఫ్లాట్లు ఇస్తామని నమ్మబలికి భారీగా డబ్బులు వసూలు చేశారు. అయితే ప్రాజెక్ట్‌కు అవసరమైన చట్టపరమైన అనుమతులు లేవనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు ఈడీ గుర్తించింది. అంతేకాదు, ప్రాజెక్ట్ భూమిని అప్పుల కోసం ముందుగానే తాకట్టు పెట్టిన విషయాన్ని కూడా కొనుగోలుదారులకు తెలియజేయలేదు.
నిందితులుహోమ్‌బయ్యర్లు, పెట్టుబడిదారులను ప్రలోభపెట్టి సుమారు రూ. 75 కోట్ల మేర అక్రమంగా సేకరించగా, అందులో రూ. 17 కోట్లను నగదుగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా, సేకరించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది. అడ్వాన్స్‌లపై వడ్డీలు చెల్లించడం, అప్పులు తీర్చడం, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడం, బ్యాంక్ డబ్బులను నగదుగా మార్చేందుకు కమిషన్లు చెల్లించడం వంటి పనులకు నిధులను వినియోగించారు.
ఇంతటితో ఆగకుండా, ప్రాజెక్ట్ కోసం కొనుగోలు చేసిన భూములను సంబంధం లేని వ్యక్తులకు విక్రయించినట్లు, ఆ విషయాన్ని కూడా హోమ్‌బయ్యర్లకు దాచిపెట్టినట్లు బయటపడింది. భూములు అమ్మిన తరువాత కూడా ముల్పురి శివరామకృష్ణ అడ్వాన్స్‌లు వసూలు చేయడం కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భారీ మోసం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. నిందితులపై మరిన్ని చర్యల దిశగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.



.webp)


