Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే భలే ఉంటుంది- మోదీ
posted on: Mar 31, 2016 5:19PM

దేశంలో ఏదో ఒక మూల ఎప్పుడూ ఏదో ఒక ఎన్నిక జరుగుతూ ఉండటం మనకి తెలిసిందే! ఇలా తరచూ ఎన్నికలు జరగడం వల్ల అటు సమయమూ, ఇటు డబ్బూ వృథా అవుతున్నాయని చాలామంది వాపోతుంటారు. ఇప్పుడు మోదీ కూడా అలాంటి వారితో ఏకీభవిస్తున్నట్లున్నారు. ఈ మధ్యే జరిగిన ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, దేశంలోని అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిపితే చాలా బాగుంటుందని సూచించారట. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంటు... ఇలా ప్రజల చేత ఎన్నుకోబడే వ్యవస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరగాలని ఆయన కోరుకుంటున్నారట.
దీని వల్ల తరచూ ఎన్నికల ప్రచారాలకి తిరుగుతూ నాయకులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి ఉండదని ఆయన ఉద్దేశం. పైగా కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో ఎన్నికలు జరిగే ప్రాంతంలో ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేసే అవకాశం ఉండదు. అయితే మోదీ ఈ విషయాన్ని కేవలం ఆలోచనతో వదిలేట్లు లేరు. తాను మిగతా పార్టీలతో కూడా ఈ విషయమై చర్చించనని, చాలామంది దీనికి సుముఖంగా ఉన్నారని మోదీ చెబుతున్నారు. ఇక బీజేపీ ఎలాగూ ఈ విధానానిక మొదటి నుంచి అనుకూలంగానే ఉంది. అసెంబ్లీ, పార్లమెంటులకు ఒకేసారి ఎన్నికలు జరిగేలా ఒక విధానాన్ని రూపొందించాలని ఆ పార్టీ తన 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది కూడా!






