Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్కూల్ అడ్మిషన్ ఫాంలోకి "భారత్ మాతాకీ జై"
posted on: Apr 4, 2016 5:03PM
.jpg)
ప్రజంట్ దేశ రాజకీయాల్ని ఒక ఊపు ఊపుతున్న ''భారత్ మాతాకీ జై" అన్న నినాదం రాజకీయ పార్టీల కార్యాలయాలను దాటి పాఠశాలలకి పాకింది. స్కూల్ అడ్మిషన్ ఫాంలో ''భారత్ మాతాకీ జై" అన్న కాలానికి రైట్ మార్క్ కొడితేనే అడ్మిషన్ అంటూ ఒక స్కూల్ కొత్త వివాదానికి తెరలేపింది. దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి రక్షించిన జాతిపిత పుట్టిన గుజరాత్ గడ్డపై ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అమ్రేలిలో శ్రీ పటేల్ విద్యార్థి ఆశ్రమంలో కొత్తగా అడ్మిషన్ పొందేవారు భారత్ మాతాకీ జై అని దరఖాస్తులో నింపాలని లేదంటే అడ్మిషన్ ఇవ్వబోమని ఆ విద్యాసంస్థ స్పష్టం చేసింది. శ్రీ పటేల్ విద్యార్థి ఆశ్రమం కింద ఒక ప్రాథమిక పాఠశాల,రెండు హైస్కూళ్లు, ఒక కాలేజీలు నడుస్తున్నాయి. సదరు విద్యాసంస్థ నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. ఇలాంటి వివాదాల్లోకి విద్యను లాగడం మంచిది కాదని ఒక వర్గం, చిన్నతనం నుంచే విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపోందించాలనుకోవడం మంచి నిర్ణయమని ఒక వర్గం అంటున్నాయి.






