Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Illu illalu pillalu : గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పేసిన సాగర్.. శ్రీవల్లికి మిల్ భాద్యతలు!
posted on: Feb 13, 2026 10:21AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -393 లో.. భాగ్యం ఆనందరావు, శ్రీవల్లి ముగ్గురు కలిసి అమూల్య ఎందుకు అలా చేసిందని ఆలోచిస్తారు. అప్పుడే ప్రేమ, నర్మద వస్తారు. ఏంటి అంత ఓవర్ గా థింక్ చేస్తున్నారని అడుగుతారు. ఆ విశ్వగాడు అసలు అమూల్యని పెళ్లి చేసుకోలేదట తనే మెడలో వేసుకుందట అని శ్రీవల్లి అనగానే అలా అని ఎవరు అన్నారని నర్మద అడుగుతుంది. ఆ విశ్వగాడు చెప్పాడని శ్రీవల్లి అంటుంది.
మరొకవైపు రామరాజు హాల్లో కూర్చొని ఇంట్లో అందరిని పిలుస్తాడు. సాగర్ ని దగ్గరికి పిలిచి ఇక మిల్ కి రాను.. నాకు అవమానంగా ఉంది.. ఇక నువ్వే మిల్ చూసుకోవాలని సాగర్ తో రామరాజు అంటాడు. లేదు నాన్న నేను చూసుకోలేనని సాగర్ అంటాడు. ఎందుకని రామరాజు అడుగుతాడు. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని సాగర్ అనగానే అందరు షాక్ అవుతారు. నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ రాసావ్ రా అని చందు అడుగుతాడు రాసాను కానీ వస్తుందనుకోలేదని సాగర్ అంటాడు. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని రామరాజు అడుగుతాడు. వచ్చాక చెప్దామనుకున్నానని సాగర్ అనగానే రామరాజు బాధపడతాడు. నాక్కూడా చెప్పలేదు నిన్న చెప్పాడని నర్మద అనగానే నీకు తెలియకుండా ఎలా ఉంటుంది. నువ్వే ఒకసారి ఎగ్జామ్ రాపించావ్ అని వేదవతి కోప్పడుతుంది. అంటే మీ మావయ్య గుడిలో స్వీట్ పంచింది.. నీకు జాబ్ వచ్చినందుకేనా నాకు ఇప్పుడు అర్ధం అయింది అంటే మీ మావయ్య ఇంటికి ఇల్లరికం వెళ్ళాడానికి నువ్వు సిద్ధం అయ్యావ్ అన్నమాట అని రామరాజు అంటాడు.
అదేం లేదు నాన్న.. నేను ఎప్పటికి ఇల్లరికం వెళ్ళనని సాగర్ చెప్తాడు ఇక మిల్ ని అమ్మేస్తానని రామరాజు అనగానే నేను చూసుకుంటానని చెప్పు ధీరజ్ అని ప్రేమ సైగ చేస్తుంది. ఆ లోపే చందు మిల్ ని నేను చూసుకుంటాను. జాబ్ మానేస్తానని చెప్తాడు. దాంతో శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును మావయ్య ఇద్దరం కలిసి చూసుకుంటామని తాళాలు ఇవ్వమని శ్రీవల్లి చెప్తుంది. దాంతో శ్రీవల్లికి తాళాలు ఇస్తుంది వేదవతి. ఆ తర్వాత శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావు ముగ్గురు కలిసి డాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






