భిక్షాటన నిషేధం.. ఏపీ సర్కార్ జీవో
posted on: Oct 31, 2025 9:24AM

ఆంధ్రప్రదేశ్ లో భిక్షాటనపై నిషేధం అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేచసింది. 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025కు రాష్ట్రగవర్నర్ ఈ నెల 15న ఆమోదముద్ర వేయగా.. 27న ఏపీ గెజిట్‌లో ప్రచురితమైంది. దీంతో ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.58 విడుదల చేసింది. ఈ చట్టాన్ని సంక్షేమ, పోలీసు శాఖలు సమన్వయంతో అమలు చేయనున్నాయి.
రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో ఈ చట్టాన్నీ తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. భిక్షాటనను నిషేధిస్తూ చట్టం అమలులోకి రావడంతో ఇకపై రాష్ట్రంలో ఎక్కడ భిక్షాటన చేసినా.. తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. అయితే ఈ చట్టం కింద యాచకుల్ని శిక్షించరు. ప్రభుత్వాలతో పాటుగా స్వచ్ఛంద సంస్థల సాయంతో వారికి పునరావాసం కూడా కల్పిస్తారు. ఇప్పటికే మిజోరం భిక్షాటనను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ఇప్పుడు ఏపీ కూడా రాష్ట్రంలో భిక్షాటనను నిషేధించింది.


.webp)



