Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బండి సంజయ్ ఆశీర్వాద యాత్రలో తేనెటీగల దాడి
posted on: Mar 14, 2026 5:10PM
.webp)
కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన 'అంజన్న ఆశీర్వాద' పాదయాత్రలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. రామడుగు మండలం కోనరావుపేట ప్రాంతంలో యాత్ర సాగుతుండగా శుక్రవారం (14-3-26) డ్రోన్ కెమెరా ద్వారా ఫుటేజ్ తీసేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈక్రమంలో చెట్టుకు ఉన్న తేనెతుట్టకు డ్రోన్ తగిలింది. దీంతో ఒక్కసారిగా తేనెటీగలు పైకి లేచి దాడి చేశాయి. వెంటనే బండి సంజయ్, ఆయన సిబ్బంది అప్రమత్తమయ్యారు. తేనెటీగల దాడితో యాత్రలో పాల్గొన్న కార్యకర్తలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తేనెటీగల దాడిలో నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో పాదయాత్రకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అనంతరం తిరిగి మొదలైంది. బండి సంజయ్ చేపట్టిన ‘అంజన్న ఆశీర్వాద’ యాత్ర కరీంనగర్ నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు సాగనుంది. మొత్తం 40 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రానికి కొండగట్టుకు బండి సంజయ్ పాదయాత్రగా కోవడంతో ఆశీర్వాద యాత్ర ముగిసింది.






