వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా అండర్ 19 జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
posted on: Feb 7, 2026 12:02PM

అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన యువ భారత్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఈ విషయంలో క్రికెట్ లోని మూడు వరల్డ్ కప్ లూ అంటే పురుషుల, మహిళల, అండర్ 19 పురుషుల వరల్డ్ కప్ లు మూడు భారత్ వద్దే ఉన్నట్లైంది.
అదటుంచితే అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ మొత్తం అద్భుత ప్రతిభ చూపిన టీమ్ ఇండియా యువజట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. టోర్నీ మొత్తంలో ఒక్క పరాజయం కూడా లేకుండా నిలిచిన యువ భారత జట్టు యావద్భారతదేశాన్నీ గర్వపడేలా చేసిందని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఇక బీసీసీఐ అయితే వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా అండర్ 19 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత యువ క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిచ్చిన అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్ ఇండియా యువజట్టు, సహాయక సిబ్బంది, సెలెక్షన్ కమిటీకి కలిపి మొత్తం 7.5 కోట్ల రూపాయల నగదు బహుమతి అందజేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నగదు బహుమతిలో ఎవరికి ఎంత, ఎలా పంచాలన్న విషయాన్ని త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపింది.



.webp)


