ఉద్యోగం వెతుకులాటలో బరాక్ ఒబామా...

posted on: Jun 22, 2016 12:29PM


వచ్చే ఏడాది జనవరి 20 నాటికి ఒబామా అమెరికా అధ్యక్ష పదవికాలం ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే పదవికాలం అయిపోయిన తరువాత ఒబామా ప్లాన్ ఏంటీ.. ఏముంది రెండుసార్లు అగ్రరాజ్యమైన అమెరికాకే అధ్యక్షుడిగా ఉన్నారు.. కోట్లకి కోట్లు సంపాదించుకొని ఉంటారు.. చక్కగా ఎంజాయ్ చేస్తారు.. అని అనుకుంటారు. మన దేశంలో ఆ పప్పులన్నీ ఉడుకుతాయేమో కానీ అమెరికాలో మాత్రం అవి జరిగే పనులు కాదు. అమెరికా అధ్యక్ష పదివి నుండి దిగిపోయిన తరువాత చాలా మంది సాదాసీదాగానే జీవితం గడుపుతున్నారు. ఇప్పటికే చాలా మంది అలా సాదాసీదా జీవితం గడుపుతున్నవారు కూడా ఉన్నారు.

 

ఇప్పుడు ఒబామా కూడా అలానే గడపాలి. దానికోసం ఆయన ఓ ఉద్యోగం వెతుక్కోక తప్పదు. ఈవిషయంపై ఆయన గతంలో చాలా సందర్భాల్లో కూడా మాట్లాడారు. అధ్యక్ష పదవి నుండి దిగిపోయిన తరువాత ఎలాంటి ఉద్యోగం చేయాలో తనకి ఇంకా క్లారిటీ రాలేదని.. కొత్త ఉద్యోగం కోసం అందరిలాగా లింకెడ్ ఇన్ వెబ్ సైట్లో చేరాల్సి వస్తుందేమో.. నేను కూడా లింకెడ్ ఇన్ లో ఖాతా తెరుస్తాను. ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో చూడాలి అంటూ అన్నారు. మొత్తానికి దేశాల్నింటికీ ఆగ్రదేశమైనా అమెరికాకు అధ్యక్షుడిగా చేసినా కూడా పదవి నుండి తప్పుకున్న తరువాత ఉద్యోగం కోసం వెతుక్కోవడం అశ్యర్యపడాల్సిన విషయమే.. అదే మన దేశంలో అయితే అధికారంలో ఉన్నప్పుడే అందినంత దోచుకొని.. అధికారం పోయినా ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...