Latest News

సీఎం రమేష్ కు భన్వర్‌లాల్ వార్నింగ్

posted on: May 7, 2014 3:01PM

 

 

 

క్రమశిక్షణకు మారుపేరులా వుండే తెలుగుదేశం పార్టీలో పానకంలో పుడకలా వుండే వ్యక్తి సీఎం రమేష్. మొన్నామధ్య సమైక్య ఉద్యమం సందర్భంగా రాజ్యసభలో ఈయనగారు చేసిన హడావిడి చూసి తెలుగువారందరూ తలలు దించుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీఎం రమేష్ పెద్ద తలనొప్పిలా మారాడన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

 

సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా  తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ పట్ల సీఎం రమేష్ దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. రమేష్ తీరు పట్ల రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.



జమ్మలమడుగు నియోజకవర్గంలో పక్క గ్రామాల నుంచి ఏజెంట్లను నియమించుకునే విషయంలో హైకోర్టు తీర్పుకు సంబంధించి సీఎం రమేష్ భన్వర్‌లాల్‌ని నిలదీశారు. అది తమ పరిధిలోకి రాదని భన్వర్‌లాల్ చెప్పడంతో సీఎం రమేష్ అసహనంగా, దురుసుగా మాట్లాడారని తెలుస్తోంది. సీఎం రమేష్ ప్రవర్తన పట్ల భన్వర్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని అంటూ, సీఎం రమేష్ తన తీరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...