Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ సీజ్… ఐటీ అదుపులో “కొండ”
posted on: Mar 27, 2026 4:34PM
.webp)
శేరిలింగంపల్లికి చెందిన వ్యాపారవేత్త, హోప్ ఫౌండేషన్ ప్రతినిధి, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. ఈ ఘటన నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చోటుచేసుకుంది... గురువారం సాయంత్రం సమయంలో న్యూఢిల్లీలో జరగనున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి బయలుదేరిన కొండా విజయ్ కుమార్‌ను హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో స్థానిక ఐటీ అధికారులు అడ్డుకుని పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే... అక్కడి ఢిల్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్ట్ లోనే విచారణ ప్రారంభించారు.
విచారణ సమయంలో ఆయన వద్ద ఉన్న మొత్తం బంగారాన్ని పూర్తిగా సీజ్ చేశారు. అంతేకాకుండా ఆయన పేరుతో ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 12 గంటల పాటు కొండ విజయ్ కుమార్ ను విచారణ చేసిన అనంతరం హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు తాత్కాలిక అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే తదుపరి విచారణకు మళ్లీ హాజరుకావాల్సి ఉందని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం తో కొండ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు చేపట్టిన చర్యలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






