తిరుమల చేరకున్న బండ్ల గణేష్ విజయసంకల్పయాత్ర

posted on: Feb 10, 2026 1:59PM

 

సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన విజయ సంకల్ప పాదయాత్ర తిరుపతికి చేరింది. ఆయనకు స్థానిక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఆ తర్వాత కాలినడకన తిరుమలకు బయలుదేరారు. జనవరి 19న షాద్ నగర్ లోని తన నివాసం నుంచి నుంచి పాదయాత్ర ప్రారంభించిన బండ్ల గణేష్.. 23 రోజుల్లో 520 కిలోమీటర్లు నడిచివచ్చారు. శ్రీవారి ఆశీస్సులతో తన యాత్ర విజయవంతమైందని ఆయన తెలిపారు. 

రేపు (బుధవారం) స్వామివారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలని  బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని కోరుకున్నారు. ఆయన కోరిక మేరకు చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడమే కాకుండా, మళ్లీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 

దీంతో, ఆయన శ్రీవారికి తన మొక్కు చెల్లించుకున్నారు. తన కోరిక నెరవేరడంతో శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నానని చెప్పారు. ఇప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 23 రోజుల పాటు 520 కిలోమీటర్ల మేర సాగిన బండ్ల గణేష్ పాదయాత్ర విజయవంతం అయింది. మరోవైపు తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో బండ్ల గణేష్‌ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును సత్కరించారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...