కేటీఆర్ నా జోలికొస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా... బండి సంజయ్ వార్నింగ్
posted on: Feb 4, 2026 3:40PM

బీఆర్‌ఎస్ పదేళ్లు పాలనలో తనపై వేల కేసులు పెట్టించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌక్‌లో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతు ఇప్పుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు పంపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్...నా జోలికొస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. నీ అరాచకాలు, నువ్వు చేసిన నీచ పనులన్నీ బయటపెడతాని బండి సంజయ్ హెచ్చరించారు.
కేంద్రం నిధులిస్తే...ఆ నిధులను మింగి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నరని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు నయాపైసా ఇయ్యలేదని తెలిపారు. కాంగ్రెస్ వద్ద పైసాలు లేవని... వాళ్లకు ఎందుకు ఓటేయాలని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. అందుకే 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారని తెలిపారు. గాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం చేస్తున్నారని విమర్శించారు. మాకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు.


.webp)



