ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం

 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 వారాలుగా మోగిన మైకులు, ఉపన్యాసాలిచ్చిన నేతలు సైలెంట్ అయ్యాయి. మరోవైపు బీహార్‌లోనూ రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది.

జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 407 పోలింగ్ బూత్‌లు  ఏర్పాటు చేశాం. మూడంచెల భద్రత ఉంటుంది. 45 FST, 45 SST టీమ్స్ నియోజకవర్గం లో పని చేస్తున్నాయి. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు.

పారా మిలిటరీ బలగాలు..

‘‘561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల క్యూ మెయింటెన్ చేయడానికి ఎన్‌సీసీ వాలంటీర్లు పని చేయనున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తుమని తెలిపారు 26 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి తెలిపారు.పోస్టల్ బ్యాలెట్ ద్వారా 103 మంది ఓటింగ్ పూర్తిందని పేర్కొన్నారు. ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారని ఈ నెల 11న పోలింగ్.. 14న కౌంటింగ్, ఫలితాల వెల్లడి తాయని తెలిపారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu