Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అందుకే నా కుమారుడిని పోలీసులకు అప్పగించా : బండి సంజయ్
posted on: May 20, 2026 4:05PM
.webp)
కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దయాదాక్షిణ్యాలతో మోదీ పాలన నడుస్తుందా అని ప్రశ్నించారు. విచారణకు సహకరించాలని ఉద్దేశంతోనే నా కన్న కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ తెలిపారు. నా బర్తరఫ్, అరెస్ట్ కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ సృష్టి అని అన్నారు. బీఆర్ఎస్ గడీలు బద్దలు కొట్టాననే ఆక్రోశంతో కేటీఆర్ ఉన్నారని...ఫేక్ న్యూస్ చూసి జనం నవ్వుకుంటున్నారు. ఫాల్తుగాళ్లు చేసే ప్రచారాన్ని పట్టించుకోనని కేంద్ర మంత్రి తెలిపారు. నా శవంపై కాషాయ జెండా కప్పాల్సిందే అదే నా చివరి కోరిక అని సంజయ్ అన్నారు.
ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు శనివారం రాత్రి భగీరథ్‌కు ఎలాంటి ముందస్తు బెయిల్ లేదా అరెస్ట్ నుండి తాత్కాలిక రక్షణ మంజూరు చేయడానికి నిరాకరించిన కొన్ని గంటల్లోనే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
లుకౌట్ సర్క్యులర్ జారీ అయిన తర్వాత, దేశం దాటి వెళ్లకుండా పోలీసులు నిఘా ఉంచిన తరుణంలో లాయర్ల ద్వారా భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయారు. చట్టాన్ని గౌరవించి, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. చట్టం ముందు తన కొడుకైనా, సామాన్యుడైనా ఒకటేనని, ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.
ఈ కేసు గత మే 8వ తేదీన మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రారంభమైంది. జూన్ 2025 నుండి ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి భగీరథ్ లైంగికంగా వేధించాడని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. తొలుత భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 74, 75 మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, మే 12న బాధితురాలి తుది స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన తర్వాత కేసును మరింత తీవ్రమైనదిగా మార్చారు.
తీవ్రమైన లైంగిక దాడికి సంబంధించిన పోక్సో సెక్షన్ 5(l) తో పాటు సెక్షన్ 6ను ఈ కేసులో జోడించి, విచారణకు హాజరుకావాలంటూ మే 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయానికి భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే, లాయర్ల సలహా మేరకు కోర్టు తీర్పు కోసం వేచి చూడటం వల్లే పోలీసుల ముందుకు రావడంలో కొంత ఆలస్యమైందని బండి సంజయ్ వివరించారు.
మరోవైపు, ఈ వ్యవహారంలో బండి భగీరథ్ సైతం కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఒక కౌంటర్ ఫిర్యాదును నమోదు చేశారు. సదరు బాలిక మరియు ఆమె తల్లిదండ్రులు తనను హనీట్రాప్ చేసి, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. స్నేహం పేరుతో దేవాలయాలకు, కుటుంబ వేడుకలకు పిలిచి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చారని భగీరథ్ పేర్కొన్నారు. కేసు పెడతామని బెదిరించడంతో భయపడి తాను ఇప్పటికే ₹50,000 నగదును వారికి చెల్లించానని, అయినప్పటికీ వారు సంతృప్తి చెందకుండా ఏకంగా ₹5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ క్రిమినల్ కుట్రకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో వెల్లడించారు.
ఈ పరస్పర ఆరోపణల నడుమ లొంగిపోయిన భగీరథ్‌ను సైబరాబాద్ పోలీసులు సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయనను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా, కోర్టు ఆయనకు మే 29 వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ హైప్రొఫైల్ కేసు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.


.webp)
.webp)


