TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ

Published on: Tue Jun 30, 2026 9:47PM

 

పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సుజన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. తాను నిర్దోషినని, తనపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపితమైందని, దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరించానని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. గత నెల 16న మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల బీబీఎం బ్యాక్‌లాగ్స్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఈ నెల 20న మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన భగీరథ్, పరీక్షలు పూర్తయిన అనంతరం జూన్ 25న తిరిగి జైలుకు వెళ్లారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పోక్సో కేసుల్లో అరెస్టైన వ్యక్తులు సాధారణంగా 45 రోజుల తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మే 16 నుంచి జూన్ 30 నాటికి 45 రోజుల వ్యవధి పూర్తికావడంతో భగీరథ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.