Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పేట్ బషీరాబాద్‌లో బండి భగీరథ్‌పై ఫోక్సో కేసు విచారణ వేగవంతం
posted on: May 11, 2026 8:50PM
.webp)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ ఆదేశాలు వచ్చిన వెంటనే డీసీపీ రితిరాజ్ రంగంలోకి దిగారు. గంటల వ్యవధిలోనే ఆమె విచారణ బాధ్యతలు స్వీకరించి, కేసు ఫైళ్లను స్వయంగా పరిశీలించడం ప్రారంభించారు. అనంతరం ఆమె తన బృందంతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, రిపోర్టులను సమీక్షించారు.
స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ క్యాబిన్‌లో డీసీపీ రితిరాజ్ అధ్యక్షతన ఏసీపీలతో ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసు ప్రస్తుత స్థితి, సేకరించిన డిజిటల్ ఆధారాలు, సాక్ష్యాల వివరాలు, అలాగే తదుపరి విచారణ ప్రణాళికపై చర్చించినట్లు సమాచారం. కేసులో అత్యంత కీలకమైన అంశంగా భావిస్తున్న మైనర్ బాధితురాలి స్టేట్మెంట్‌ను పోలీసులు ఇప్పటికే ఒకసారి నమోదు చేశారు. అయితే విచారణలో మరిన్ని వివరాలు వెలికితీయాల్సిన అవసరం ఉన్నందున, మరోసారి బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రక్రియను చట్టపరమైన మార్గ దర్శకాలకు అనుగుణంగా, అత్యంత సున్నితంగా నిర్వహించనున్నారు. ఈ కేసు
దర్యాప్తులో భాగంగా నిందితుడి కాల్ డీటైల్ రికార్డ్స్ (CDR), మొబైల్ డేటా, కమ్యూనికేషన్ రికార్డులు సహా ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు విశ్లేషి స్తున్నారు. కేసుకు సంబంధించి ప్రతి చిన్న ఆధారాన్ని క్రాస్ చెక్ చేస్తూ నిజ నిర్ధారణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.*డీసీపీ రితిరాజ్ ఈ కేసుపై మాట్లాడుతూ*ఈ కేసు దర్యాప్తులో ఎవరి పాత్ర అయినా తేలితే... అట్టి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆరోపణలు నిర్ధారితమైతే అరెస్ట్ కూడా తప్పదని ఆయన పేర్కొన్నారు. కేసును పూర్తిగా లోతుగా విచారించి, న్యాయపరమైన ప్రక్రియను అనుసరిస్తామని తెలిపారు. దర్యాప్తు వేగవంతం కావడంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు, విచారణ బృందాల రాకపోకలు పెరిగాయి. స్టేషన్‌లో ప్రత్యేక సమావేశాలు జరుగుతుండటంతో పరిస్థితి మరింత సున్నితంగా మారింది. ప్రతి గంటకు కొత్త అప్‌డేట్లు సేకరిస్తూ దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఈ కేసు రాజకీయంగా సున్నితమైనదిగా మారిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, పూర్తిగా న్యాయపరమైన ప్రమాణాలతో విచారణ కొనసాగిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.


.webp)
.webp)


