Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జైలు తిండికి బండి దూరం.. పాలు, బ్రెడ్ తోనే సరి
posted on: May 18, 2026 10:23AM
.webp)
పోక్సో కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు నిబంధనల ప్రకారం అధికారులు ఆయనను ఒక సాధారణ ఖైదీగానే పరిగణిస్తూ విచారణ ఖైదీల బ్యారక్‌లోనే ఉంచారు. ఈ క్రమంలో జైలులో మొదటి రోజు ఆయన అక్కడి భోజనాన్నితినలేదు. జైలు క్యాంటీన్ నుండి తెప్పించుకున్న పాలు, బ్రెడ్డు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం.
న్యాయస్థానం రెండు వారాల రిమాండ్ విధించడంతో శనివారం ( మే 16) రాత్రి పోలీసులు భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు, ఇతర అధికారిక ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆయనను నేరుగా విచారణ ఖైదీలు ఉండే బ్యారక్‌కు పంపారు. ఆదివారం ( మే 17) ఖైదీల కోసం ప్రత్యేకంగా వండిన మాంసాహారాన్ని సైతం ఆయన ముట్టలేదని జైలు వర్గాల సమాచారం.
మరోవైపు ఈ సంచలన కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌తో పాటు బాధితురాలి తల్లి న్యాయస్థానానికి సమర్పించిన కీలక ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపనున్నారు. ఈ కేసులోని మరిన్ని విషయాలను, వాస్తవాలను రాబట్టేందుకు భగీరథ్‌ను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయాలని భావిస్తున్నారు.






