Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో 10న విద్యా సంస్థల బంద్.!
posted on: Jul 7, 2026 2:37PM

తెలంగాణలో ఈ నెల 10 విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో నెలకొన్న విద్యా రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు ఇఛ్చాయి. ఈ మేరకు బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ వరంగల్ జిల్లా నెక్కొండలె ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో మంగళవారం (జులై 7) పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు. ఇవీ ఆ డిమాండ్లు...
- బకాయి పడ్డ ఫీజు రీఇంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.
- ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం. మౌలికవసతులు కల్పించాలి.
- విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
- ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులను నియంత్రించాలి.
July10th, Long Standing. Pending, Problems, Poster


%20(1)(3).webp)



