వచ్చే ఏడాదికి బందరు పోర్టు పూర్తి!

posted on: Oct 3, 2024 1:03PM

వచ్చే ఏడాదికల్లా బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.  రూ. 3,669 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పోర్టు పనులు జగన్ హయాంలో నత్తనడకన సాగాయని చంద్రబాబు విమర్శించారు.  నిన్న ఆయన పోర్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు.  పోర్టు నిర్మాణానికి అవసరమైన  మరో 38.32 ఎకరాల భూమిని అందిస్తామన్నారు.   పోర్టు పూర్తైతే మచిలీపట్నం రూపురేకలే మారిపోతాయన్నారు.  అవసరమైన రోడ్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ స్ట్రీమ్ లైన్, నీటి సదుపాయం కల్పిస్తామన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...