Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బనకచర్ల ప్రాజెక్టు కేసులో తెలంగాణకు సుప్రీంలో ఎదురుదెబ్బ..!
posted on: Jul 13, 2026 12:27PM
.webp)
బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తొలి దశలోనే తెలంగాణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెంటనే నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసు నిబంధనలకు అనుగుణంగా దాఖలు కాలేదని పేర్కొం టూ, ముందుగా రిజిస్ట్రీ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలకు సంబంధించిన ఒరిజినల్ సూట్‌లను విచారించే విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన విధివిధానాలను తప్పనిసరిగా అనుసరిం చాలని పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ నేరుగా బెంచ్ ముందుకు రావడం సరికాదని, ముందుగా రిజిస్ట్రీ పరిశీలన అనంతరం చాంబర్ జడ్జి ఎదుట విచారణకు రావాల్సి ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది. ప్రతివాదులకు ముందస్తుగా నోటీసులు జారీ చేయకుండానే ఈ పిటిషన్‌ను బెంచ్ ముందు లిస్ట్ చేయడంపై కూడా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజిస్ట్రీ నిబంధనలను పాటించ కుండా విచారణ కోరడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించింది.
అయితే, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనను ధర్మాసనం అంగీకరించలేదు. దీంతో ఏపీకి ఎలాంటి నోటీ సులు జారీ చేయకుండా కేసును నిబంధనల ప్రకారం మళ్లీ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీంతో బనక చర్ల ప్రాజెక్టు అంశంలో తెలంగాణ ప్రభుత్వం న్యాయపరమైన ప్రక్రియను మళ్లీ ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రీ నిబంధనలకు అనుగుణంగా పిటిషన్ దాఖలు చేసిన అనంతరం మాత్రమే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో తదుపరి విచారణ కొనసాగే అవకాశం ఉంది.


.webp)



