Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజిల్ పై బ్యాన్.. విజయ్ భయమేనా?
posted on: Feb 9, 2026 2:10PM

తమిళనాడులో ఇప్పుడు నటుడు దళపతి విజయ్ రాజకీయపార్టీ టీవీకే పైనే రాజకీయ చర్చ అంతా కేంద్రీకృతమై ఉంది. ఈ ఏడాది తమళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఆ పార్టీ ఎలా ఫెర్ఫార్మ్ చేస్తుంది. ఎన్నికలలో ఆ పార్టీ చూపే ప్రభావమెంత అన్న విషయంపైనే పరిశీలకులు పలు విధాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. అది పక్కన పెడితే కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది. సాధారణంగా చెన్నైలో ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే మైదానంలో ఆటను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులు తమ అభిమాన జట్టుకు మద్దతుగా విజిల్స్ మోగిస్తారు. మైదానం విజిల్ కూతలతో మార్మోగిపోతుంటుంది. అంతెందుకు చెన్నై సూపర్ కింగ్స నినాదమే విజిల్ పోడు.
సరే చెపాక్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ లే కాదు దేశవాళా మ్యాచ్ లు జరిగిన ప్రతి సందర్భంలోనూ స్టేడియం బయట విజిల్స్ విక్రయిస్తుంటారు. ఆటను చూడటానికి స్టేడియంకు వచ్చే ప్రేక్షకులు వాటిని కొనుగోలు చేసి తమ అభిమాన జట్టకు విజిల్ సౌండ్ తో మద్దతు ప్రకటిస్తుంటారు. చెపాక్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఇది సర్వసాధారణంగా జరిగేదే.
అయితే ఆదివారం (ఫిబ్రవరి 8) చెపాక్ స్టేడియం వేదికగా టి20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్, నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో స్టేడియంలో ఎక్కడా విజిల్ సౌండ్ వినిపించలేదు. అంతే కాదు.. స్టేడియం బటట విజిల్స్ విక్రయాలు కూడా వేవు. ఇందుకు కారణం స్టేడియంలోకి విజిల్స్ అనుమతించబోమంటూ నిర్వాహకులు ప్రకటించడమే. అయితే ఇది ఐసీసీ విధించిన నిబంధన కాదు. మరేమిటి ప్రభుత్వమే అనధికారికంగా విజిల్స్ పై బ్యాన్ విధించడమే ఇందుకు కారణం.
టీవీకే పార్టీకి ఎన్నికల సంఘం విజిల్‌ను ఎన్నికల గుర్తుగా కేటాయించిన క్షణం మొదలుకుని ఆ పార్టీ మీటింగ్స్ లో విజిల్స్ మోత మోగిస్తున్నాయి. దీంతో టీవీకే ఎన్నికల చిహ్నం చాలా వేగంగా జనాలలోకి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన అధికార డీఎంకే చెన్నైలోని చెపాక్ స్టేడియంలోకి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ల సందర్భంగా విజిల్ ను బ్యాన్ చేసింది. అలా చేయకపోతే.. స్టేడియంలో విజిల్స్ మోత టీవీల్లో ప్రసారమై టీవీకే పార్టీకి ఉచితంగా ప్రచారం లభిస్తుందని భావించడం వల్లనే విజిల్స్ పై స్టేడియంలో అనధికార బ్యాన్ విధించిందని పరిశీలకులు విష్లేషిస్తున్నాయి. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే చేపాక్ స్టేడియంలోకి విజిల్స్ కు అనుమతి లేదంటూ నిర్వాహకులు నిబంధన పెట్టాయని అంటున్నారు.


.webp)



