హిందూపురంలో ప్రచారంతో మోక్షజ్ఞ పొలిటికల్ ఎంట్రీ?

posted on: Apr 23, 2014 10:47AM

 

 

 

నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి తారకరామ మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశం కంటే ముందే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడా? తాతకి, తండ్రికి, హోల్‌సేల్‌గా నందమూరి వంశానికి తానే అసలైన వారసుడనని చెప్పకనే చెప్పబోతున్నాడా? ఈ ప్రశ్నలకి తెలుగుదేశం వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.

 

ఇప్పటికే ఇరవై యేళ్ళు నిండిన మోక్షజ్ఞను రాజమౌళి దర్శకత్వంలో తెలుగు తెరకు పరిచయం చేయడానికి ఓపక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పొలిటికల్‌గా కూడా మోక్షజ్ఞ ఫుల్ యాక్టివ్‌గా వున్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రచారాన్ని ఫేస్‌బుక్, లింక్‌డ్ ఇన్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లద్వారా నిర్వహిస్తున్న విషయం రీసెంట్‌గా బయటపడింది.



కూల్‌గా, బయటకి రాకుండా వుంటూనే లోపల్లోపల తెలుగుదేశం పార్టీ కోసం నందమూరి వంశ వారసుడిగా మోక్షజ్ఞ చేస్తున్న సర్వీస్ తెలుగుదేశం వర్గాలని ముగ్ధులను చేస్తోంది. అలాగే ఈసారి ఎన్నికలలో తన తండ్రి పోటీ చేస్తున్న హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మోక్షజ్ఞ తండ్రితోపాటు ప్రచారంలో పాల్గొనే అవకాశం వుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. తండ్రితోపాటు ప్రచార రథంపై మోక్షజ్ఞ కూడా కనిపించే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే  మోక్షజ్ఞ భారీ ప్రసంగాలేవీ చేయకుండా ముద్దుముద్దుగా రెండు మూడు మాటలతో తన తండ్రికి ఓటేయమని హిందూపురం ఓటర్లని రిక్వెస్ట్ చేస్తాడని తెలిసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...