ముఖ్యమంత్రి పదవిని వద్దనను: నందమూరి బాలకృష్ణ
posted on Apr 16, 2014 12:57PM
.jpg)
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ చూపు ముఖ్యమంత్రి పదవి మీద పడింది. నామినేషన్ దాఖలు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలకృష్ణ తన మనసులోని మాట బయటపెట్టారు. తనను గెలిపిస్తే హిందూపురం నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్తానని హామీలు గుప్పించిన ఆయన, ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం మీకు వుందా అని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే కాదనని స్పష్టంగా సమాధానం చెప్పారు. సీమాంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేది చంద్రబాబునాయుడే అనే విషయం నోట్లో వేలేసుకునే అమాయకులకి కూడా తెలుసు. ఆ పదవి వైపు చూడటానికి కూడా తెలుగుదేశంలో ఎవరికీ సాహసం లేదు. అలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి మీద తన అభిప్రాయన్ని బాలకృష్ణ స్పష్టంగా చెప్పడం తెలుగుదేశంలో కొత్త చర్చలకు దారి తీసింది.