భార‌త స్టాక్ మార్కెట్ల‌ బ్యాడ్ టైం ముగిసిందా?.. మోర్గాన్ స్టాన్లీ ఏమంటోంది?

posted on: Jun 5, 2026 4:02PM

భారత స్టాక్ మార్కెట్‌పై మోర్గాన్ స్టాన్లీ తాజా అంచనాలు రిలీజ్ చేసింది..సెన్సెక్స్ 89వేల‌  వరకు వెళ్లొచ్చని చెప్పే సాహ‌సోపేత‌మైన‌ ప్రొజెక్షన్లు జారీ  చేసింది. సాధారణ బ్రోకరేజ్ రిపోర్టుల‌ కంటే ఇవి ఎంతో ఎక్కువ.  భారత ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ పెట్టుబడుల ఒర‌వ‌డి, ఏఐ యుగంలో భారత స్థానం, దేశీయ పెట్టుబడిదారుల మానసిక స్థితి.. అన్నిటినీ క‌లిపి  చెప్పే  అతి పెద్ద కథ ఇది.  భార‌త్ కి ప‌ట్టిన  దుష్ట‌పీడ  వ‌దిలింద‌ని మోర్గాన్ స్టాన్లీ చీఫ్ ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ చెప్పింది.  కేవలం మార్కెట్ ప‌రిమితికి  మాత్ర‌మే చెందిన‌ది కాదు. గత రెండేళ్లలో భారత మార్కెట్లు ఎదుర్కొన్న సైలెంట్ అండర్‌పర్ఫార్మెన్స్ కి సంబంధించిన సమాధానం కూడా. 

గ‌త దశాబ్దం  భారత మార్కెట్ల  స్ట్రక్చరల్ స్టోరీ ని ఒక సారి గ‌మ‌నిస్తే..  యువ జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి, వినియోగ ఆధారిత వృద్ధి. ఇవి భారత మార్కెట్లకు  లాంగ్ టర్మ్ బుల్ స్టోరీ గా మారాయ‌ని చెప్పాల్సి ఉంటుంది.  ఇక సంస్థాగ‌త  సంస్క‌ర‌ణ‌లైన‌ జీఎస్టీ, ఇన్సాల్వెన్సీ కోడ్, డిజిటల్ పేమెంట్స్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్.. వంటివి పెట్టుబడిదారుల దృష్టిలో.. పాలసీ స్టెబిలిటీ ప్ల‌స్ రీఫార్మ్ కలయికగా నిలిచిన‌ట్టు తెలుస్తోంది.  ఇక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు తగ్గడం వల్ల, భారత మార్కెట్లకు..  లో బీటా, హయ్యర్ పీఈ  న్యాయబద్ధత లభించింది.  అంటే ఈ రేషియో కలయిక ఒక ప్రత్యేకమైన కంపెనీ నైపుణ్యాన్ని లేదా మార్కెట్ పరిస్థితిని సూచిస్తుంది.  

2024- 25  గ్లోబల్ ఏఐ బుల్ రన్‌లో భారత మార్కెట్ల రిలేటివ్ ఓటమి, ఎమ్ఎస్సీఐఈఎమ్  తో పోలిస్తే బలహీనత వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తే.. డాలర్ టర్మ్స్‌లో 2025 భారత మార్కెట్లకు గత మూడు దశాబ్దాల్లో అత్యంత బలహీన రిలేటివ్ ఇయర్‌గా నమోదైంది.ఎమ్ఎస్సీఐఈఎమ్ 19 నుంచి 20 శాతం వరకు ర్యాలీ అవుతుంటే,ఎమ్ఎస్సీఐ  India కేవలం 1నుంచి 2శాతం మాత్రమే పెరిగింది.
  
ఏఐ, సెమీకండక్టర్, టెక్ ఇన్‌ఫ్రా మార్కెట్లకు క్యాపిటల్ ఫ్లో ఎలాంటిదో చూస్తే.. అమెరికా, తైవాన్, కొరియా, చైనా.. టెక్ స్టాక్స్‌లో ఏఐ ట్రేడ్ బ‌ద్ధ‌లు  కాగా, భారత మార్కెట్లకు డైరెక్ట్ ఏఐ ప్లే లేద‌నే భావన బలపడింది. 
ఐటీ అవుట్‌సోర్సింగ్‌పై సందేహాలు ఎలాంటివంటే, ఏఐ వల్ల సర్వీస్ ఎగుమతులు, ఐటీ అవుట్‌సోర్సింగ్ మోడల్ దెబ్బతింటుందనే భయం, భారత మార్కెట్లపై  స్లో బర్న్ నెగటివ్ సెంటిమెంట్‌గా పనిచేసింది. 

2024- 2025 మ‌ధ్య కాలంలో ర్యాలీ ఉన్నా, ఇండియా రిలేటివ్‌గా వెనుకబడింది . సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాలు ఎలాంటివంటే..  2024 చివర, 2025 ప్రారంభంలో.. ఇండెక్స్‌లు కొత్త ఎత్తుల‌ను తాకినా, డాలర్ టర్మ్స్‌లో ఈఎమ్ లతో పోలిస్తే భారత్ వెనుకబడిందనే చెప్పాల్సి ఉంటుంది. రిటైల్ ఫ్లోలు, ఎస్ఐపీల‌ విష‌యానికి వ‌స్తే.. దేశీయ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు, రిటైల్ డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడులు.. మార్కెట్‌ను నిలబెట్టినా, ఎఫ్పీఐలు,   ఏఐ సెంట్రిక్ మార్కెట్ల వైపు మళ్లాయి. 

89వేల‌ సెన్సెక్స్ టార్గెట్ ని ఒక‌సారి  ప‌రిశీలిస్తే.. 2025 ఆగస్టు-సెప్టెంబర్‌లో మోర్గాన్ స్టాన్లీ, 2026- జూన్  నాటికి సెన్సెక్స్ 89వేల పాయింట్లు చేరవచ్చని ఒక అంచ‌నా వేసింది. ఇది సుమారు 10 నుంచి 12శాతం అప్సైడ్ అన్న  అసెస్మెంట్లున్నాయి. 23.5,  ట్రైలింగ్ పీ/ఈ.. ఈ టార్గెట్ వద్ద.. సెన్సెక్స్ 25 ఏళ్ల సగటు పీ/ఈ కంటే ప్రీమియంలో ట్రేడ్ అవుతుందని, ఆ ప్రీమియానికి కారణం- లో బీటా ప్ల‌స్ స్ట్రక్చరల్ గ్రోత్ ప్ల‌స్ పాలసీ ప్రెడిక్టబిలిటీ అని రిధమ్ దేశాయ్ కామెంట్ చేశారు.

2025 డిసెంబర్, 2026 జనవరి మ‌ధ్య కాలంలో.. మార్కెట్లు టర్న్ అయ్యాయని, కంబ్యాక్ నారేటివ్
హెచ్ టీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో వ్యాఖ్యలను బ‌ట్టి  తెలుస్తోంది.  2025 చివర్లో రిధమ్ దేశాయ్ అన్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. ఇది గత 20, 30 ఏళ్లలో భారత మార్కెట్లకు అత్యంత బ్యాడ్ డాలర్ రిటర్న్ పీరియడ్.  కానీ, టర్న్ ఇప్పటికే మొదలైంద‌ని అంటారాయ‌న‌. 2026 భారత ఈక్విటీలకు చాలా ఎగ్జైటింగ్ ఇయర్ అవుతుందని కూడా చెప్పారు.
 
మోర్గాన్ స్టాన్లీ  థాట్స్ ఆన్ ది మార్కెట్ పోడ్‌కాస్ట్ ఏమంటుందంటే.. 2026 జనవరిలో విడుదలైన ఎపిసోడ్‌లో చెప్పిన‌దాన్నిబ‌ట్టి చూస్తే.. ఇండియా స్టాక్స్ కంబ్యాక్‌కు ఈ కేసు ఎలాంటిదో వివ‌రించారు రిధమ్ దేశాయ్. అండర్ పర్ఫార్మెన్స్, వాల్యుయేషన్ కూలింగ్, ఎర్నింగ్స్ యాక్సిలరేషన్ ఈ మూడూ కలిసి  రివర్స్  అవుతున్నాయని చెప్పారు. 

స్థిరమైన ద్రవ్యోల్బణం, మితమైన వాస్తవ వడ్డీ రేట్లు, ఫిస్కల్ కన్సాలిడేషన్, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్.   వాల్యుయేషన్ల  కూలింగ్.. ఎమ్ఎస్సీఐ చరిత్రాత్మకంగా  10 నుంచి 11శాతం వార్షిక రాబడులు సాధ్యమని అంచ‌నా వేసింది మోర్గాన్ స్టాన్లీ.  ఎర్నింగ్స్ యాక్సిలరేషన్ ఎలాంటిదో చూస్తే 26 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 10శాతం, 28 ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ నాటికి.. 20శ‌తానికి  పైగా ఎర్నింగ్స్ గ్రోత్ క్యాపెక్స్, మాన్యుఫ్యాక్చరింగ్, AI–లింక్డ్ ప్రొడక్టివిటీ గెయిన్స్ వల్ల..   సెన్సెక్స్ సీనారియోలు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని  తెలుస్తోంది.

మార్కెట్ ర్యాలీకి వెనుకున్న పాలసీ, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ విష‌యంలో.. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్  ద్రవ్యోల్బణం 4-2 శాతం బ్యాండ్‌లో ఉంచే ఆర్బీఐ మాండేట్, వడ్డీ రేట్ల వోలాటిలిటీ తగ్గించి, ఈక్విటీ వాల్యుయేషన్లకు హయ్యర్ పీ/ఈ ను న్యాయబద్ధం చేస్తోందని అంటోంది మోర్గాన్ స్టాన్లీ.
  
2025లో ప్రారంభమైన రేటు కోతలు, సీఆర్ఆర్ తగ్గింపులు.. క్రెడిట్ గ్రోత్, కన్స్యూమర్ స్పెండింగ్, కార్పొరేట్ క్యాపెక్స్‌కు బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయన్న‌ది రిధమ్ దేశాయ్ కామెంట్. కార్పొరేట్ బైబ్యాక్‌లు ఎలా ఉన్నాయంటే.. గత 12 నెలల్లో  10 బిలియన్ డాల‌ర్ల‌కు పైగా బైబ్యాక్‌లు..కంపెనీలు తమ షేర్లను వాల్యుయేషన్ ఆకర్షణీయంగా ఉందనే అనే సంకేతాన్నివ్వ‌డానికి  కొనుగోలు చేస్తున్నాయని గుర్తించింది మోర్గాన్ స్టాన్లీ.

సెబీ కఠినమైన డిస్క్లోజర్ నిబంధనలు, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజం.. విదేశీ పెట్టుబడిదారులకు రూల్ ఆఫ్ లా సిగ్నల్‌గా పనిచేస్తున్నాయి. 
 ఏఐ–సెంట్రిక్ మార్కెట్ల వైపు ఎఫ్పీఐలు మళ్లినా..  భారతదేశం  లాంగ్ టర్మ్ అలొకేషన్ లో కీలక భాగంగా కొనసాగుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా.  తక్కువ విలువ కలిగిన రూపాయి, మితమైన రియల్ రేట్లు.. ఎగుమతులకు, క్యాపిటల్ ఇన్‌ఫ్లోలకు అనుకూలంగా ఉన్నాయన్న‌ది వారి వాదన.   రాజకీయ స్థిరత్వం, పాలసీ ప్రెడిక్టబిలిటీని ఒక‌సారి  ప‌రిశీలిస్తే..  ఫంక్షనింగ్ డెమోక్రసీ ప్ల‌స్ స్ట్రాంగ్ మాండేట్ ఎలాంటిదంటే, మోర్గాన్ స్టాన్లీ రిపోర్టులు, భారతదేశాన్ని  పాలసీ స్టెబిలిటీ ఉన్న పెద్ద డెమోక్రసీగా ప్రొజెక్ట్ చేస్తోంది. దీన్ని వాల్యుయేషన్ ప్రీమియానికి కీలక కారణంగా చూపుతున్నాయి.  
ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, ఎనర్జీ క్యాపెక్స్ వంటివి ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారీ క్యాపెక్స్ ప్రోగ్రామ్. రోడ్లు, రైల్వేలు, డిఫెన్స్, ఎనర్జీ, సెమీకండక్టర్లు. ఇవి ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్‌కు  స్ట్రక్చరల్ టెయిల్‌విండ్ గా చూపిస్తున్నాయి.
  
ఐటీ అవుట్‌సోర్సింగ్‌పై భయం ఎలాంటిదో చూస్తే.. ఏఐ వల్ల కోడింగ్, రొటీన్ సర్వీసులు ఆటోమేట్ అవుతాయనే భయం, మధ్యతరగతి ఉద్యోగ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ విష‌యంలో   మోర్గాన్ స్టాన్లీ కౌంటర్ నారేటివ్ ఏంటంటే.. ఏఐ  వల్ల ప్రొడక్టివిటీ పెరిగి, మొత్తం ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. ఇక గ్లోబల్ కంపెనీలు ఏఐ అప్లికేషన్లు, సొల్యూషన్లు డెవలప్ చేయడానికి భాగస్వాములను వెతుకుతుండగా, భారతఐటీ సేవల సంస్థలు  అనుకోని లాభదారులు కావచ్చని వారు వాదిస్తున్నారు. 

సెన్సెక్స్ టు హిట్ 89 థౌజండ్..  ఇండియాస్ మార్కెట్ కంబ్యాక్, 2026 నాటిక‌ల్లా వెరీ వెరీ  ఎగ్జైటింగ్ వంటి మీడియా హెడ్ లైన్లు.. రిటైల్ ఇన్వెస్ట‌ర్ల‌లో ఫియ‌ర్ మిస్సింగ్ అవుట్ పెంచే ప్ర‌మాదం క‌లిగిస్తున్నాయి.  అధిక వాల్యుయేషన్లు, ఆదాయ అసమానత, యువ నిరుద్యోగం, రూరల్ డిమాండ్ బలహీనత వంటి అంశాలను చూపిస్తూ,  మార్కెట్ రియ‌ల్ పిక్చ‌ర్- గ్రౌండ్ రియాలిటీ మధ్య గ్యాప్ ఉందని హెచ్చరిస్తున్నారు కొంద‌రు ఫైనాన్షియ‌ల్ ఎక్స్ ప‌ర్ట్స్.

బ్యాడ్ టైం ముగిసింద‌ని న‌మ్మ‌డం ఎలా అని  ప‌రిశీలిస్తే..  డెమోగ్రాఫిక్స్, ఇన్ఫ్రా క్యాపెక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ షిఫ్ట్, డిజిటల్ ఎకానమీ. ఇక బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ రంగాల్లో ఎర్నింగ్స్ గ్రోత్ వేగవంతమవుతున్న సంకేతాలు అందుతున్నాయి. ఈఎమ్ లతో పోలిస్తే భారత ప్రీమియం తగ్గడం, రివర్స్ అవడానికి స్పేస్ ఉందనే వాదనగా తెలుస్తోంది.  

ఫైన‌ల్ గా..  మార్కెట్ బూమ్ వ‌ర్సెస్ గ్రౌండ్ రియాలిటీ ఎలా  ఉందంటే,  2025లో గ్లోబల్ జీడీపీ గ్రోత్‌లో భారతదేశం 18శాతం కాంట్రిబ్యూషన్ ఇచ్చిందని అంచనాలున్నాయి. ఇది మ‌రింత‌ పెరుగుతుందని భావిస్తోంది మోర్గాన్ స్టాన్లీ.    మార్కెట్ క్యాపిటలైజేషన్, కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరుగుతున్నప్పటికీ, నిరుద్యోగం, రూరల్ ఇన్‌కమ్ స్టాగ్నేషన్, అనధికార రంగం సమస్యలు.. ఇవి జ‌న‌బాహుళ్యంలో ప్రధాన అంశాలైన  చ‌ర్చ‌నీయాంశాలుగా ఉన్నాయి. ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్.. ఇంటింటి సేవింగ్స్‌లో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ వాటా పెరగడం, ఒకవైపు మార్కెట్‌కు బలం చేకూర్చుతుండ‌గా.. మరోవైపు, మార్కెట్ కరెక్షన్ వస్తే- సామాన్య మధ్యతరగతిపై ప్రభావం కూడా ఎక్కువగా క‌నిపిస్తోంది.

మోర్గాన్ స్టాన్లీ చెప్పే చెడ్డ‌కాలం  ముగిసింద‌నే వాదనకు బలమైన ఆధారాలు ఉన్నాయి. మాక్రో స్టెబిలిటీ, స్ట్రక్చరల్ గ్రోత్ డ్రైవర్లు, ఎర్నింగ్స్ యాక్సిలరేషన్, వాల్యుయేషన్ రిలేటివ్ కూలింగ్. భారతదేశం గ్లోబల్ గ్రోత్‌లో పెద్ద భాగస్వామిగా మారుతున్నదనే పెద్ద కథ కూడా వాస్తవానికి దగ్గరగానే ఉంది.    

స‌రిగ్గా అదే సమయంలో.. వాల్యుయేషన్లు ఇప్పటికీ ప్రీమియంలోనే ఉన్నాయి. ఏఐ, చమురు, జియోపాలిటిక్స్, దేశీయ, సామాజిక ఆర్థిక అసమానతలు.. ఇవ‌న్నీ మ‌నం ఎదుర్కోవ‌ల్సిన  స‌మ‌స్య‌లుగా తెలుస్తున్నాయి. బ్రోకరేజ్ టార్గెట్లు..  ఎలా ఉన్నాయంటే,సెల్లింగ్ నారేటివ్ కూడా అవుతాయి. అవి ఎప్పుడూ నెరవేరవు.

కాబట్టి, భారత మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉండటం ఒక విషయం. ఆ బుల్లిష్‌నెస్‌ను డేటా, వాల్యుయేషన్, రిస్క్ మేనేజ్‌మెంట్‌తో బ్యాలెన్స్ చేయడం మరో విషయం. కంబ్యాక్ స్టోరీ నిజం కావ‌చ్చు, కానీ అది లీనియర్‌గా, నేరుగా 89 వేల నుంచి ల‌క్ష పాయింట్ల  దిశగా వెళ్లే హైవే మాత్రం కాదు. మధ్యలో ఎన్నో గుంతలు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు తప్పక ఉంటాయ‌న్న హెచ్చ‌రిక‌లు సైతం అందుతున్నాయి.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...