జూబ్లీహిల్స్ రేసులో ఉన్నా.. మహ్మద్ అజారుద్దీన్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారని అంశంపై పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో  అందరూ ఇదే అంశంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే,  పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు  మహమ్మద్ అజారుద్దీన్  తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తానూ రేసులో ఉన్నానని స్పష్టం చేశారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు చివరి క్షణంలో పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడాననీ, స్వల్ప ఓట్ల తేడాతో పారజయంపాలయ్యాననీ చెప్పారు.  ఓట్లతో ఓడిపోవడం జరిగిందని అన్నారు.

ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో   సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలయ్యేలా తాను పనిచేశానని చెప్పారు. తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో, మీడియా మాధ్యమాల్లో, వెబ్ సైట్ల లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారనీ, తనకు టికెట్ ఇవ్వడంలేదని ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గడిచిన ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయి లో, డివిజన్ స్థాయిలో సమావేశాలు సైతం నిర్వహించామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేసి విజయం సాధించి  రాహుల్ గాంధీ కి బహుమతిగా అందిస్తామని అన్నారు.