Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శరీరంలో కొవ్వు కరిగించే ఆయుర్వేదం సూప్.. రోజులో ఒక్కసారి తాగినా చాలు..!
posted on: Jul 25, 2026 10:21AM
శరీరంలో కొవ్వు కరిగించే ఆయుర్వేదం సూప్.. రోజులో ఒక్కసారి తాగినా చాలు..!

శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు. కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి. కొందరికి పొట్ట భాగం, మరికొందరికి పిరుదుల భాగం, ఇంకొదరికి తొడలు, మరికొందరికి తొడలకు ఇరుప్రక్కలా.. ఇలా చాలా ప్రదేశాలలో కొవ్వు పెరుగుతూ ఉంటుంది. నేటికాలంలో దీన్ని ఫ్యాట్ అని కూడా అంటారు. అయితే కారణాలు ఏవైనా.. శరీరంలో పెరిగిన కొవ్వును కరిగించడం అంత సులభమేమీ కాదు.. చాలామంది జిమ్ కు వెళ్తారు, వాకింగ్ చేస్తారు, కడుపు కూడా కాల్చుకుంటారు. కానీ ఫలితం పెద్దగా ఉండదు. అయితే శరీరంలో కొవ్వు కరిగించడానికి ఆయుర్వేదం చాలా చక్కని మార్గాన్ని సూచించింది. అదే ఆయుర్వేదం సూప్ . ఈ సూప్ ను రోజులో కనీసం ఒక్క పూట అయినా తీసుకుంటే శరీరంలో కొవ్వు మెల్లిగా తగ్గుతుందట. ఆ సూప్ ఏంటో.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా తాగాలో తెలుసుకుంటే..
శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి, బరువు తగ్గడానికి చాలామంది సలాడ్ ను తింటారు. క్యారెట్, కీర దోస, బీట్రూట్, టమోటా, ఉల్లిపాయ వంటివి సలాడ్ లో భాగంగా పచ్చివి తింటుంటారు. అయితే.. ఆయుర్వేదం సూప్ ఇంకా చక్కని ఫలితాలు ఇస్తుంది.
ఆయుర్వేదం సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..
పొట్లకాయ,
బీరకాయ,
సొరకాయ,
దోసకాయ,
టమోటా,
గుమ్మడికాయ,
క్యారెట్,
బీట్రూట్,
పై చెప్పుకున్న కూరగాయలు అన్నీ ఒక కప్పు వచ్చేలా తీసుకోవాలి.
తయారు చేసే విధానం..
కూరగాయలను ముక్కలుగా తీసుకున్నాక.. ఆ ముక్కలను పాత్రలోవేసి తగినన్ని నీరుకలిపి చిన్నమంట పైన మరిగించాలి.
ముక్కలు మరుగుతూవుండగా అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మిరియాలపొడి, సైంధవలవణం, తగినంత కలుపుకోవాలి.
ముక్కలు బాగా ఉడికినతరువాత దించి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచాలి.
ఎలా తీసుకోవాలి?
ఉడికించిన ముక్కలు గోరు వెచ్చగా అయిన తరువాత మొదట కూర ముక్కలను తినాలి, ఆ తర్వాత కూర ముక్కలు ఉడికించిన నీటిని సూపులా తాగాలి.
ఈ సూప్ తాగడం వల్ల శరీరంలో అదనంగా ఒకగ్రాము కూడా కొవ్వు పెరగదు.. పైగా ఇందులో వాడిన కూరగాయలలో నీటి శాతం, ఫైబర్ శాతం మెరుగ్గా ఉన్నవే.. ఈ కారణంగా ఈ సూప్ తీసుకోవడం వల్ల పొట్ట కూడా కరుగుతుంది.
శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు, రక్తం శుద్దిగా లేకుండా పదే పదే మొటిమలు, గుల్లలు, పొక్కులు కడుతున్నవారు.. ఈ సూపును తీసుకుంటే మంచిరక్తం ఏర్పడుతుంది, రక్తం శుద్ది అవుతుంది, చర్మం కూడా చాలా మెరుగ్గా మారుతుంది.
*రూపశ్రీ.






